తెలంగాణ అసెంబ్లీకి 15 మంది డాక్టర్లు ఎన్నిక !

Telugu Lo Computer
0


ట్టసభల్లోకి చదువుకున్న నాయకులు రావాలని, అలాగైతేనే సమాజానికి మేలు జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్న వేళ  ఏకంగా 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. వివిధ పార్టీలకు చెందిన 15 మంది వైద్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరిలో కొంత మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. గెలిచిన 15 మంది వైద్యుల్లో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. ఎమ్మెల్యేలుగా గెలిచిన 15మంది వైద్యుల్లో అయిగురికి ఇప్పటికే ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు వైద్య సేవలందిస్తున్న వీరంతా ఇకపై ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)