మళ్లీ గాజా ఆక్రమించొద్దు !

Telugu Lo Computer
0


మాస్ తమ దేశంపై దాడి చేసిందన్న కారణాన్ని చూపుతూ పాలస్తీనాలోని గాజా నగరాన్ని తిరిగి ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల్ని అమెరికా తప్పుబట్టింది. హమాస్ పై ప్రతిదాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు ఇప్పటివరకూ మద్దతిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు  తాజాగా గాజా ఆక్రమణ కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను మాత్రం తప్పుబట్టారు. ఇది ఇజ్రాయెల్ కు మంచిది కాదని వైట్ హౌస్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించుకోవడం మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భావిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత ఈ పాలస్తీనా నగరంలో తీవ్రవాదుల కోసం తమ దేశ ప్రజల భద్రతను పణంగా పెట్టలేమంటూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేయించారు. "ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం మంచిది కాదని అధ్యక్షుడు ఇప్పటికీ విశ్వసిస్తున్నారని,. ఇది ఇజ్రాయెల్‌కు మంచిది కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు మంచిది కాదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ సీఎన్ఎన్ తో వ్యాఖ్యానించారు. గాజా విషయంలో ప్రస్తుతం అమెరికా హోంశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జరుపుతున్న చర్చల్లో హమాస్ తో పోరు ముగిశాక ఆ తర్వతా గాజా ఎలా ఉంటుంది? గాజాలో పాలన ఎలా ఉంటుంది? అనే అంశాలున్నట్లు తెలిపారు. ఎందుకంటే అది ఎలా ఉన్నా తాజాగా హమాస్ దాడుల సమయంలో ఉన్నట్లు మాత్రం ఉండబోదన్నారు. గాజా నగరంపై ఇజ్రాయెల్ భూమార్గంలో దాడులు చేయడాన్ని కూడా అమెరికా గతంలో తప్పుబట్టింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు హమాస్ తో పోరు ముగిశాక దాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను అరబ్, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. అమెరికా కూడా ఇది ఇజ్రాయెల్ ప్రజలకు మంచిది కాదని చెబుతోంది. అయినా ఇజ్రాయెల్ వినిపించుకునే పరిస్ధితుల్లో లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)