శ్రీవల్లి పాటపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమితాబ్ బచ్చన్ !

Telugu Lo Computer
0

పుష్ప లోని శ్రీవల్లి సాంగ్ గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో అల్లు అర్జున్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. దాంతో పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీవల్లీ పాటలో అల్లు అర్జున్‌ స్టెప్‌ గురించి కామెంట్స్ చేశారు బిగ్ బి. పుష్ప సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ నటన అద్భుతం. శ్రీవల్లి లో చెప్పు వదిలేస్తే వైరల్ అవ్వడం నా జీవితంలో మొదటి సారి చూశా అని అన్నారు అమితాబ్ బచ్చన్. ఈ పాట వచ్చాక చాలా మంది ఈ స్టెప్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అందరూ చెప్పులు వదిలేసి.. మళ్లీ వేసుకోవడం చేశారు అంటూ సరదాగా చెప్పారు అమితాబ్ బచ్చన్.

Post a Comment

0Comments

Post a Comment (0)