నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ మోసం చేసిందంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంపై డిగ్గీ రాజా మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతాడని, ఆయన నెంబర్‌ 1 అబద్ధాలకోరు అని దిగ్విజయ సింగ్‌ ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందిన వారేనని, మరి కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీలను మోసం చేసినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)