బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి నటి అంకితా లోఖండే కీలక వ్యాఖ్యలు చేశారు. అతడితో బ్రేకప్ గురించి ఆమె తొలిసారి మాట్లాడారు. సుశాంత్‌ను తాను ఎంతగానో ప్రేమించానని.. ఎదుటివాళ్ల మాటలు విని అతడు తన నుంచి విడిపోయి ఉంటాడని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ''మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. అతడు విడిపోదాం అన్నప్పుడు నేను షాకయ్యా. అతడి నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. అతడు బ్రేకప్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. అయితే.. అతడి నిర్ణయాన్ని తప్పుబట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లడానికి భయపడ్డా'' అని తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంజినీరింగ్ చదివి సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కెరీర్ ఆరంభంలో పలు ధారావాహికల్లో నటించాడు. ఓ సీరియల్ కోసం అంకితా లోఖండేతో కలిసి పని చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరూ విడిపోయారు. రియా చక్రవర్తితో సుశాంత్ రిలేషన్‌లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. సరైన అవకాశాల్లేక మానసిక కుంగుబాటుతో 2020 జూన్ నెలలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కారణం చెప్పకుండానే సుశాంత్ బ్రేకప్ చెప్పాడు !
November 01, 2023
0
Tags