కాంగ్రెస్ గూటికి వివేక్ వెంకటస్వామి !

Telugu Lo Computer
0


మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు. తనకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ తో వివేక్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. కీలకమైన సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలనే వివేక్ కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు.అంతకుముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. రాహుల్ సమక్షంలో వివేక్.. తన కొడుకు వంశీతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. శంషాబాద్ నోవాటెల్ లో రాహుల్ గాంధీతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్ కు వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా వెళ్లారు. చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ రేసులో వివేక్ తనయుడు వంశీ ఉన్నారు. వివేక్ కుమారుడు వంశీకి చెన్నూరు సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రాహుల్ గాంధీతో వివేక్ చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బీజేపీలో అవకాశాలు ఇచ్చినందుకు ఆ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివేక ప్రెస్ నోట్ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)