ఇటీవల ఒక వ్యక్తికి పంది నుంచి తీసిన గుండెను అమర్చారు. వైద్య చరిత్రలో ఇదో పెద్ద సంచలనంగా ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది. ఇలా చేసిన శాస్త్ర చికిత్సలో పంది గుండెతో ఆ వ్యక్తి సుమారు 40 రోజుల పాటూ బతికారు. అయితే గత కొన్ని రోజులుగా గుండె స్పందనలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మృత్యుంజయుడనుకున్న ఆ 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ మరణించారు. అత్యంత ప్రయోగాత్మకంగా శస్త్రచికిత్స చేసిన 40 రోజుల తర్వాత, పంది నుండి తీసిన గుండెను అమర్చిన రెండవ వ్యక్తి మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్, సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ హార్ట్‌ను స్వీకరించి గుండె వైఫల్యంతో చనిపోతున్నాడు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి నెలలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది, అయితే ఇటీవలి రోజుల్లో ప్రతికూల సంకేతాలు కనిపించడం మొదలైంది. శస్త్రచికిత్స తర్వాత దాదాపు ఆరు వారాల పాటు జీవించి సోమవారం మరణించాడు.
పంది గుండె మార్పిడి చేసిన లారెన్స్ ఫౌసెట్ మృతి
November 01, 2023
0
Tags