ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఇందిరాగాంధీ జూ పార్కులో విషాదం నెలకొంది. జూలో ఎలుగుబంటి దాడిలో ఓ యువకుడు మృతి అక్కడివారందరిని కలిచివేసింది. ఇందిరాగాంధీ జూ పార్కులో గత ఎంతోకాలం నుంచి నగేష్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కేర్‌టేకర్‌గా విధులు నిర్వహిస్తు ఉన్నాడు. అయితే, ఇవాళ ఉదయం నగేష్ ఎప్పటిలాగే, జూ పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్నాడు. అయితే, ఒక్కసారిగా అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది. అయితే, అతడు ఎలుగుబంటి బోనులో ఉందేమో అని అనుకుని, తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు తెరచి ఉండడాన్ని కూడా అతడు గమనించలేదు. అనుకోకుండా ప్రమాదానికి గురి అయ్యాడు. ఎలుగుబంటి దాడిలో తప్పించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, అప్పటికే ఎలుగుబంటి తన గోళ్లతో అతన్ని రక్కి ప్రాణాలు తీసేసింది. అయితే, ఈ సమయంలో జూలో చాలామంది ఉన్నారు కానీ, ఎలాంటి ప్రయత్నం లేకుండా పోయింది. ఆ ఎలుగుబంటి దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరు సందర్శకులు భయంతో వణికిపోతున్నారు. ఈ దాడి ఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బోనులో బందించడం జరిగింది. అయితే, తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న నగేషన్ జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎలుగుబంటి దాడిలో కేర్‌టేకర్ మృతి !
November 27, 2023
0
Tags