నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం

Telugu Lo Computer
0


లక్నో వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ జట్టుపై 7 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఆఫ్గానిస్తాన్ చేజింగ్‌లోనూ ఆకట్టుకుంది. 31.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి నెదర్లాండ్స్ నిర్ధేశించిన టార్గెట్ ని అలవోకగా ఛేదించింది. దీంతో, సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న అఫ్గాన్‌ నేడు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘానిస్తాన్ బ్యాటర్లలో, రెహ్మత్‌ షా.. (52), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (56 నాటౌట్‌) హాఫ్ సెచరీలతో ఆకట్టుకున్నారు. ఇక, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (31 నాటౌట్‌) పరుగులతో రాణిచించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)