తెలంగాణలో రూ.500 కోట్ల విలువైనవి సీజ్

Telugu Lo Computer
0


తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇప్పటివరకూ దాదాపు రూ.500 కోట్ల విలువైనవి లభించాయి. నిన్న ఆదివారం హైదరాబాద్ లోని నిజాంపేటలో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని పట్టుకున్నారు. తెలంగాణ సరిహద్దుల వెంట పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి అటుగా వెళ్లే వాహనాల్ని అడ్డుకొని చెక్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నులు, వీఐపీలు, మంత్రులు, చివరకు సీఎం వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. అందుకే పోలీసులకు భారీగా విలువైనవి లభిస్తున్నాయి. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకూ రూ.480.25 కోట్లకు పైగా విలువైన బంగారం, వెండి, క్యాష్, మద్యం, మత్తు పదార్థాలు, కుక్కర్లు, మిక్సీలు వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్నకొద్దీ అక్రమాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తనిఖీలు మరింత జోరుగా చెయ్యాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు ఇప్పటివరకూ రూ.3 కోట్ల విలువైన 84,400 లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి 88 కేసులు రాసి, 23 మందిని అరెస్టు చేశారు. అలాగే 75 కేజీల గంజాయిని సీజ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)