హైదరాబాద్ లోని నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ నష్ట పరిహారం ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్లో లేక ఫైర్ క్రేకర్ వల్లో అగ్గి రవ్వలు రేగి, అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు. రసాయనాలను భవన సెల్లార్లో నిల్వ ఉంచడం వల్ల ఇది జరిగిందని కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానన్న కేటీఆర్.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున ప్రకటించారు. గాయపడిన వారికి ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, అవసరమైతే మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే ప్రైవేట్ ఆస్పత్రికి కూడా తరలిస్తామని అన్నారు. ఆస్తి నష్టపోయిన వారికి కూడా ప్రభుత్వం అడంగా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాలపై 6 నెలల కిందట సేఫ్టీ ఆడిట్ కింద ఎక్వైరీ చేయించామని, ఇప్పుడు ఏం జరిగిందో రిపోర్టు ద్వారా తెలుసుకుంటామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవన యజమాని రమేష్ జైశ్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవనం కింద ఉన్న గోడౌన్‌లో ఆయనే కెమికల్ డ్రమ్ములను స్టోర్ చేసినట్లు తేలింది.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం !
November 13, 2023
0
Tags