పాకిస్తాన్‌ ఆటగాళ్లకు వైరల్‌ ఫీవర్‌ !

Telugu Lo Computer
0


బెంగళూరు వేదికగా అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియాతో పాక్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్‌ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం పాల్గొనలేదు. పాక్‌ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వారిలో షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. కాగా షెడ్యూల్‌ ప్రకారం పాకిస్తాన్‌ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్‌ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్‌ సెషన్స్‌ను సపోర్ట్‌ స్టాప్‌ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)