జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని అందుకున్నాడు.  సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవమిది. ఈ మూవీలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నటన..ఆ స్వాగ్..డైలాగ్స్..సామాన్యం. ప్రజల్లో బాగా..గుర్తింపు పొందిన ఈ పాత్రను అందరూ స్వాగతించారు కనుకే అవార్డ్ దక్కిందని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో..భారతదేశం గర్వించదగే గొప్ప నటులున్నారు. రామారావు, నాగేశ్వరావు, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు..ఇలా చెప్పుకుంటే పోతే..దశాబ్దానికి ఒక పది మంది స్టార్స్ గా ఎదిగి..గుర్తింపు పొందారు. కానీ ఎవ్వరికీ ఉత్తమ జాతీయ అవార్డ్ దక్కలేదు. కనీసం మన స్టార్స్ కి ఢిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని చిరంజీవి తెలిపారు. వారి చిత్రపటాల్ని కనీసమాత్రంగా అయినా ఢిల్లీ సినిమా లైబ్రరీలో కూడా ఉంచలేదని అన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)