ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారును దొంగలించిన కొందరు దుండగులు తప్పించుకునే ప్రయత్నంలో ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఢీ కొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్ర అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన కారులో వెళుతున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అతడినిపై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడికి దిగి వాహనాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించారు. అతడిని బయటకు లాగి కారుతో సహా పారిపోయేందుకు యత్నించారు. వారిని అడ్డగించాలని చూసిన డైవర్‌ను ఢీ కొట్టారు. ఈ క్రమంలోనే బాధితుడు కారు కింద పడిపోయాడు. అయితే, ప్రమాదం తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించి కారు వేగాన్నిపెంచి బిజేంద్రను దాదాపు 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.
క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసి ఈడ్చుకెళ్లిన వైనం !
October 11, 2023
0
Tags