మోడల్ బొట్టు పెట్టుకోకపోవడంతో వివాదాస్పదమైన యాడ్ !

Telugu Lo Computer
0


నల్లి సిల్క్స్ తమ కొత్త డిజైన్లను ప్రచారం చేయడానికి ఇటీవల ఒక యాడ్‌ను రిలీజ్ చేసింది. అందులో అందమైన చీర కట్టుకున్న మోడల్ బొట్టు పెట్టుకోకుండా కనిపించిన యాడ్ చూసి జనాలు నిరాశ పడ్డారు. #NoBindiNoBusiness అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు. నవరాత్రుల వేళ ఒక వర్గం ప్రజలకు ఈ యాడ్ ఆగ్రహం కూడా తెప్పించింది. కొందరు ఈ బ్రాండ్‌ను బహిష్కరిస్తాం అని కూడా వ్యాఖ్యలు చేసారు. చాలా విమర్శల తర్వాత నల్లి సిల్క్స్ మరో యాడ్ రిలీజ్ చేసింది. దానిని నటుడు శ్రీవాస్తవ షేర్ చేసారు. క్లిప్‌లో చాలామంది మోడళ్లు నల్లి సిల్క్ చీరలు ధరించి, నగలు మరియు బొట్టును ప్రదర్శిస్తారు. ఒక స్త్రీ తన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం, మరికొందరు కాజల్ పెట్టుకోవడం, ముక్కుపుడకలు, చెవి పోగులు ధరించడం అలా ఈ యాడ్‌లో కనిపించింది. మొత్తానికి వివాదాస్పదమైన యాడ్ స్ధానంలో నల్లి సిల్క్స్ కొత్త యాడ్ రీ ప్లేస్ చేసి గొడవ సర్దుమణిగేలా చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)