రణ్‌బీర్ కపూర్‌కి ఈడీ సమన్లు జారీ !

Telugu Lo Computer
0


హదేవ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబరు 6వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్మును తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇంతకుముందే సీజ్‌ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే దీనికి కారణం. దీంతో వారికి ఈడీ సమన్లు జారీ చేస్తోంది. సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గతంలోనే ఈడీ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి నగరాల్లో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలుసేకరించింది. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హావాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్దఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)