ఆసియా క్రీడలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కనోయింగ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు అర్జున్ సింగ్, సునీల్ సింగ్ కాంస్య పతకం అందించారు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ కనోయ్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అర్జున్, సునీల్ 3ని:53.329 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో సిజీ సదానందన్-జానీ రోమెల్ భారత్‌కు కాంస్యం అందించారు.
కనోయింగ్‌లో కాంస్య పతకం !
October 04, 2023
0
Tags