వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీశైలం గౌడ్

Telugu Lo Computer
0


టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కూన శ్రీశైలం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కూన శ్రీశైలం గౌడ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై ఫిర్యాదు చేసినట్లుగా కుత్బుల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ చెప్పారు. "ఓ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్ లో నేను ప్రజా సమస్యలు లేవనెత్తితే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ వాటికీ సమాధానం చెప్పకుండా, ఉద్దేశ పూర్వకంగా, నన్ను దుర్భాషలాడుతూ నాపై చేసిన భౌతిక దాడి గురించి సూరారం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి పిర్యాదు చేయడం జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ లో బుధవారం నిర్వహించిన డిబేట్​లో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య మాటామాట పెరిగింది. కూన శ్రీశైలం గౌడ్ తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తిని అని, కనీసం ఓ పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచానని, కానీ వివేకానంద టీడీపీ నుంచి గెలిచి రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)