ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కి చెందిన సరితా సింగ్ దసరా ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. నూర్ పూర్ ప్రాంతానికి రాగానే ఆమె కారు ట్రక్కును వెనక నుంచి ఢీకొన్నది. ప్రమాద సమయంలో ఆమె స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సరితా సింగ్ కారు ట్రక్కును ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగాయి. బయటకు వచ్చేందుకు వీలుకాకపోవటంతో ఆమె డ్రైవింగ్ సీట్లోనే మంటల్లో కాలి పోయారు. కారులో ఒక్కరే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యాక్సిడెంట్ సమాచారం తెలిసి ఘటనా స్థలానికి వచ్చారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్ రింగ్ కావటంతో చనిపోయింది సరితా సింగ్ అని పోలీసులు నిర్థారించారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అనుమానాలు ఉన్నాయా లేదా అనేది విచారణ తర్వాత స్పష్టం చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కారు ట్రక్కును ఢీకొన్న ఘటనలో బీజేపీ నాయకురాలు దుర్మరణం !
October 25, 2023
0
Tags