అతివేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ జంటను ఢీకొట్టి మహిళ మృతికి బాధ్యుడైన కన్నడ నటుడు నాగభూషణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్ లోని వసంతపుర మెయిన్‌రోడ్డు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న దంపతులను శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ ప్రేమ (48) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్త కృష్ణ (58)కు కాళ్లు, తల, పొట్టపై బలమైన గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో గాయపడిన జంటను నాగభూషణ స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు.
మహిళ మృతి కేసులో నటుడి నాగభూషణ్ అరెస్ట్
October 01, 2023
0
Tags