30 కిలోల కొకైన్‌ స్వాధీనం !

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్‌ లోని రాంబన్‌ జిల్లాలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి నుంచి భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 కిలోల కొకైన్‌ పట్టుపడగా, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరును అరెస్టు చేశారు. డ్రగ్స్‌ ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని బేనీహాల్‌ వద్ద శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా.. అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు. శనివారం రాత్రి రైల్వే చౌక్‌ బానీహాల్‌ వద్ద ఓ వాహనం కశ్మీర్‌ నుంచి వస్తుండగా పట్టుకున్నారు. ఇది చాలా హైగ్రేడ్‌ కొకైన్‌ అని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని జమ్మూ జోన్‌ ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)