హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటీషన్ !

Telugu Lo Computer
0

తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో హౌస్ మొన్ పిటీషన్ దాఖలు చేసారు. బెయిల్ పిటీషన్ అత్యవసరంగా విచారాణ జరపాలని కోరారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. దీని పైన న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, వెకేషన్ బెంచ్ లో బెయిల్ పిటీషన్ రేపు విచారణకు లిస్టు అయింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27 నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్రం కారాగార అధికారులను ఆదేశించింది. సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చంద్రబాబు బెయిల్ పైన రాజకీయంగానూ టీడీపీలో చర్చ మొదలైంది. దీంతో, చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో హైకోర్టు విచారణ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠకు కారణం అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)