ఐకియాకు రూ.3 వేల జరిమానా !

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఐకియా మాల్ లో సంగీత బోహ్రా అనే మహిళ 2022 అక్టోబర్ 6 న షాపింగ్ చేసింది. అప్పుడు ఆమె 2వేల 428 రూపాయిలు విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. ఆ తరువాత క్యారీ బ్యాగ్ అడగడంతో ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ ఇచ్చి రూ.20 వసూలు చేశారు. కంపెనీ బ్రాండింగ్‌ను కలిగి ఉన్న బ్యాగ్‌ల కోసం కస్టమర్‌ల నుంచి ఎలా వసూలు చేస్తారని వాదించింది. అయినా షాపు యాజమాన్యం పట్టించుకోలేదు. స్టోర్ లోగో ముద్రించి ఉన్న బ్యాక్ పై రూ.20 వసూలు చేయటంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆమె స్టోర్ లో కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్లడానికి పేపర్ బ్యాగ్‌కు ఛార్జీ విధించినందుకు పరిహారంగా రూ.3,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 20 రూపాయిల కవరుకు వడ్డీతో కలిపి నష్టపరిహారం రూ.1,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.2,000 చెల్లించాలని ఆదేశించింది. వస్తువులను డెలివరీ చేసే స్థితిలో ఉంచేందుకు అవసరమైన అన్ని ఖర్చులను విక్రేతలే భరించాల్సి ఉంటుందని స్టేట్ కమిషన్ పేర్కొంది. ఇదే క్రమంలో వినియోగదారులు తమ సొంత బ్యాగులను తీసుకెళ్లేందుకు ఐకియా యజమాన్యం అనుమతించటం లేదని గుర్తించింది. ఒక వినియోగదారుడు 15 ప్రదేశాల్లో 15 వివిధ వస్తువులను కొనుగోలు చేసినప్పడు అందుకోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి అన్ని క్యారీబ్యాగులు తీసుకువాలని మేము ఊహించటం లేదంటూ న్యాయస్థానం పేర్కొంది. ఇచ్చిన తీర్పు ప్రకారం విధించిన జరిమానాను 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)