ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 3 వేలు దాటిన మృతుల సంఖ్య

Telugu Lo Computer
0


జ్రాయెల్-హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్‌ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై క్రమంగా పైచేయి సాధిస్తున్నది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా  కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది మృతి చెందారు. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాలో  పలు భవనాలను ఇజ్రాయెల్‌ కూల్చివేసి వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి. గాజా సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)