బీహార్ లో ఒకేరోజు వివిధ చోట్ల నీట మునిగి 22 మంది వరకు చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భోజ్‌పూర్‌లో ఐదుగురు, జహనాబాద్‌లో నలుగురు, పాట్నా, రోహతాస్‌లో ముగ్గురు, దర్భంగా, నవాడలో ఇద్దరు, మాధేపురా, కైమూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నీట మునిగి మరణించారు. చనిపోయిన వారికి సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
బీహార్‌లో ఒకేరోజు నీట మునిగి 22 మంది మృతి !
October 08, 2023
0
Tags