'ఇంజినీర్స్ డే' సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. 'సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఈ వ్యక్తి' అంటూ అతని పట్టుదలను ప్రశంసించాడు. 'ఈ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా నేను ఫొటోలోని వ్యక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈయన ఇంజినీర్ కాదు. ఎలాంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీని పొందలేదు. అలాగే ఎటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదు, ఎలాంటి యంత్రాలను రూపొందించలేదు. కానీ, ప్రతి నిజమైన ఇంజినీర్ నమ్మే సిద్ధాంతాన్నే ఈయన కూడా నమ్మారు. అసాధ్యమైన విషయం అంటూ ఏదీ లేదు' అంటూ తన అధికారిక 'ఎక్స్' ఖాతా లో దశరథ్ మాంఝీ ఫొటోతో పంచుకుంటూ ఈ మాటలు జోడించారు. ఆ ఫొటోలో ఉన్నది బీహార్‌లోని గయా జిల్లాకి చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి. ఆయన తన గ్రామస్తుల కోసం ఏకంగా పెద్ద కొండను తవ్వి రహదారి నిర్మించారు. 22 సంవత్సరాలు కష్టపడి 300 మీటర్ల పొడవు, 25 అడుగుల వెడల్పు రహదారిని ఒక్కడే పూర్తిచేశారు. ఈయన చేసిన కృషికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బహుమానం కూడా అందించారు. అతని సంకల్పం, పట్టుదలను చూసి 'భారతదేశపు పర్వత మనిషి'గా ప్రభుత్వం ఆయన్ని గుర్తించింది. మహీంద్రా షేర్ చేసిన ఫొటోను చూసిన నెటిజన్లు మాంఝీ పట్టుదలను ప్రశంసిస్తూ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని షేర్ చేసినందకు మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
భారతదేశపు పర్వత మనిషిని కొనియాడుతూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ !
September 15, 2023
0
Tags