షూటింగ్‌లో రెండు స్వర్ణాలు

Telugu Lo Computer
0


సియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఇవాళ రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ సొంతం చేసుకుందిభారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఇందులోనూ పతకాలు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్‌, దివ్య తడిగోల్ బృందం రజతం కైవసం చేసుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు దక్కించుకున్నారు. దీంతో షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. టెన్నిస్‌లో ఇప్పటి వరకు నిరాశాజనక ఫలితాలు నమోదు కాగా ఇప్పుడు వాటికి చెక్‌ పెడుతూ డబుల్స్‌లో రజత పతకం భారత్‌ సాధించింది. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సిల్వర్‌ గెలుచుకుంది. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి పతకం కాగా, సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)