సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు !

Telugu Lo Computer
0


అంతర్గత విచారణలో తమ ఆదేశాలను మార్చేశారని తేలడంతో పోలీసు కేసు నమోదుచేసి విచారణ జరపాలని జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారికి సూచించాలని పేర్కొంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది ప్రీతి మిశ్రను విచారణకు హాజరు కావాల్సిందిగా తాము ఆదేశించామని, ఆమె రాలేదని ధర్మాసనం గుర్తు చేసింది. న్యాయవాది పాత్రపై పోలీసు విచారణ జరగాలని ఆదేశించింది. పిటిషన్‌తోపాటు రెండు వేర్వేరు ఆదేశాలను జత చేయడాన్ని ధర్మాసనం తొలుత గుర్తించింది. మొదటి ఆదేశాల్లో పిటిషన్‌ను డిస్మిస్‌ చేసినట్లుగా, రెండో ఆదేశాల్లో అనుమతించినట్లుగా ఉంది. దీంతో అంతర్గత విచారణకు ధర్మాసనం గతంలో ఆదేశించింది. ఆదేశాలను మార్చినట్లు అందులోనూ తేలడంతో పోలీసు కేసు పెట్టాలని సూచించింది. దీంతో సంబంధమున్న న్యాయవాదులు ప్రీతి మిశ్ర, అఫ్తాబ్‌ అలీఖాన్‌లతోపాటు కక్షిదారు లోకేశ్‌ మదన్‌మోహన్‌కు నోటీసులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)