ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఇవాళ నిర్మాణంలో వున్న ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు.గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ సొసైటీ ఓ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపడుతోంది. లిఫ్ట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అది కుప్పకూలింది. ఈ ఘటనలో లిఫ్ట్ కిందే ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా..మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ శర్మ. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాదు.. ఘటనకు కారణమైన బిల్డర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లిఫ్ట్ కూలి నలుగురు మృతి
September 15, 2023
0
Tags