గుజరాత్ లోని గోద్రా నుంచి అనంద్ వెళ్తున్న రైలు దాహోద్ సమీపంలోకి రాగానే ఇంజన్ లో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఇంజిన్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన రైల్వే లోకో పైలెట్ ,ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో చైన్ ను లాగిన ప్రయాణికులు రైలు ఆగిన వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు దిగిపోతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని దహోద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. చివరి కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని, మిగిలిన కంపార్ట్‌మెంట్లను రక్షించామని ఏఎస్పీ కె.సిధాంత్ ఈ సందర్భంగా తెలిపారు.
నడుస్తున్న రైలులో మంటలు !
September 15, 2023
0
Tags