కోల్‌కతాలో డెంగ్యూతో బాధపడుతున్న 28 ఏళ్ల వైద్యుడు శుక్రవారం ఒక ఆసుపత్రిలో మరణించాడు. డెంగ్యూ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ కారణంగా అతను తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. వైద్యుడి మృతితో ఈ ఏడాది మృతుల సంఖ్య 25కి చేరింది. వైద్యం చేయాల్సిన వైద్యుడే మృతి చెందితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరంగా మారింది. కోల్‌కతా చుట్టుపక్కల జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డెంగ్యూ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో గత వారంలో డెంగ్యూ కారణంగా ఐదుగురు మృతి చెందారు. డెంగ్యూ రాకుండా ఉండాలంటే ప్రజలు వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తమ ఇళ్ల దగ్గర నీరు చేరకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శరీరం నిండా దుస్తులు ధరించాలి. ఎవరైనా జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు లేదా తీవ్రమైన తలనొప్పి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి
September 15, 2023
0
Tags