పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు చేసిన సౌరభ్ చంద్రకర్ !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన  సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే జూదం యాప్ ‘మహదేవ్’ని  దుబాయ్‌లో కూర్చొని ఈ యాప్ ను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ యూఏఈలో స్థిరపడి ఈ దందా చేస్తున్నారు. మరోవైపు సౌరభ్  2023 ఫిబ్రవరిలో యూఏఈలోని ఆర్ఏకే లో వివాహం చేసుకున్నారు. మహాదేవ్ యాప్ యాజమాన్యం పెళ్లి వేడుకకు రూ.200 కోట్ల నగదు ఖర్చు చేసింది. కుటుంబాన్ని నాగ్‌పూర్ నుంచి యూఏఈకి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి అలంకరణల నుంచి డ్యాన్సర్ల వరకు ముంబై నుంచి రవాణా చేసి హవాలా ద్వారా నగదు చెల్లించారు. మహదేవ్ యాప్ వ్యవహారంపై  రాయ్‌పూర్, భోపాల్, ముంబై, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 39 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. అంతేకాకుండా చంద్రాకర్, ఉప్పల్ లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం యూఏఈ కార్యాలయం నుండి ఫ్రాంచైజీ ద్వారా నడుపుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి యాప్, వెబ్‌సైట్‌ను ప్రచారం చేయడానికి భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారు. దాని కోసం పలువురు ప్రముఖులు ప్రచారం చేశారని, వారి కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగా వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని రైడ్‌లో వెల్లడైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)