హైదరాబాద్​లో పలుచోట్ల భారీ వర్షం !

Telugu Lo Computer
0


హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్​లోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడడంతో భాగ్యనగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని పాతబస్తీ, చార్మినార్​, బహదుర్​పురా, యాకుత్​పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్​, ఫలక్​నుమా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కోఠి, అబిడ్స్​, బేగంబజార్​, నాంపల్లి, బషీర్​బాద్​, లక్డీకాపూల్​, హిమాయత్​నగర్​, ట్యాంక్​బండ్​, ఆసిఫ్​నగర్​, మెహిదీపట్నం, మాసాబ్​ట్యాంక్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, మధురానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌​, నిజాంపేట, బాచుపల్లి, గండి మైసమ్మ, కృష్ణాపూర్​, దుండిగల్​, కేపీహెచ్​బీ, మైత్రివనం, మాదాపూర్​, కీసర, మల్కాజిగిరి, ఖైరతాబాద్​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, బాలనగర్​, గుండ్ల పోచంపల్లి, బహదూర్​పల్లి, సూరారం, సుచిత్ర, జగద్గిరి గుట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్​ ప్రధాన రహదారిపై ట్రాఫిక్​ నిలిచిపోయింది. ఖైరతాబాద్​ రైల్వేగేట్​ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యూసఫ్​గూడ, శ్రీకృష్ణానగర్​, పూర్ణ టిఫిన్​ సెంటర్​ వీధిలోని దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. కుంభవృష్ఠిగా నాగారంలో వర్షం కురిసింది. ఈసీఐఎల్​లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విజయనగర్​ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)