చాక్లెట్లు, పెర్ఫ్యూమ్‌లు చోరీ చేసిన దొంగలు !

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని అమృత్‌సర్‌ మెడికల్ షాపులో తగినంత డబ్బులు లేకపోవడంతో దొంగలు అసంతృప్తి చెందారు. చివరకు చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్‌, ఫేస్‌వాష్‌ క్రీమ్స్‌ను చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సంఘటన జరిగింది. సాయుధులైన ముగ్గురు వ్యక్తులు ఒక మెడికల్ స్టోర్‌లోకి చొరబడ్డారు. గన్స్‌ చూపించి ఆ షాపులో ఉన్న ఇద్దరు సిబ్బందిని బెదిరించారు. ఒక వ్యక్తి క్యాష్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. అందులో కొద్దిగా మాత్రమే డబ్బులున్నాయి. వాటిని తీసుకున్న దొంగలు అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో మెడికల్‌ షాప్‌లోని చాక్లెట్‌లు, పెర్ఫ్యూమ్స్‌, ఫేస్ వాష్ క్రీమ్‌లను దొంగిలించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆ మెడికల్‌ షాపులోని సీసీటీవీలో ఇదంతా రికార్డ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. అయితే ఈ చోరీ సంఘటన గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)