కోడిగుడ్లు పెట్టి పొదిగిన తర్వాత కోడిపిల్లలు పుట్టుకోస్తాయి. అలాగే, పాములు గుడ్లు పెడతాయని, వాటి నుండి వాటి పిల్లలు పొదుగుతాయని తెలుసు. అయితే తేళ్లు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులు, కానీ ఈ వైరల్ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపించింది. నిజానికి ఈ వీడియోలో గుడ్డు నుండి తేలు బయటకు రావడం కనిపించింది. గుడ్డు కూడా కోడి లేదా పాముకు చెందినదిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి చెంచాతో గుడ్డును పగలగొడుతున్నాడు.. ఈ క్రమంలోనే అక్కడున్న టబ్‌లో చిన్న చిన్న తేళ్లు చాలా తిరుగుతున్నాయి. గుడ్డు విరిగిన వెంటనే, దాని లోపల చాలా తేళ్లు కనిపిస్తున్నాయి. వాటిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు వీడియోని మరింత వైరల్ గా మార్చేస్తున్నారు.
పొదిగిన గుడ్డు నుండి తేళ్లు !
September 22, 2023
0
Tags