బెంగళూరులోని నారాయణ హెల్త్ సంస్థ ఒకేరోజు 3,797 ఈసీజీలు చేసిఅరుదైన రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఒకేచోట 3,797 ఈసీజీ పరీక్షలు నిర్వహించి వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో సెప్టెంబర్ 21న ఈ గొప్ప కార్యక్రమం చేపట్టినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఫీట్ తమ సంస్థకు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం కల్పించిందని పేర్కొంది. ఈ ప్రయత్నం హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్‌లో తమ సంస్థ నిబద్ధతను మరింత పటిష్టం చేసిందని ఆ సంస్థ తెలిపింది. ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ఈరోజే తమకు అందినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్య పరీక్షల గురించి అవగాహన కల్పించడం, గుండె సంబధిత జబ్బుల్ని నివారించేందుకు రెగ్యులర్ వైద్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియజెప్పడమే లక్ష్యంగా తామీ ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు.
ఒకేరోజు 3,797 ఈసీజీలు తీసిన నారాయణ హెల్త్ సంస్థ !
September 22, 2023
0
Tags