కెనడాలో మరో ఖలిస్థానీ సునుభూతి పరడు హత్యకు గురయ్యాడని సమాచారం. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం జరిగిన దాడిలో సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే మృతి చెందినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. ఇదిలా ఉంటే మరణించిన సుఖా దునెకే పంజాబ్‌లోకి మోఘా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 2017లో సుఖా దునెకే నికలీ సర్టిఫికేట్లతో కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం కెనడాలో గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరినట్లు సమాచారం. ఖలీస్థానీ ఉద్యమంలో సుఖా కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. హర్‌దీప్ సింగ్ నిజ్జన్ హత్య కేసులో భారత్, కెనడాల మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారలో దుండగులు అతడిని కాల్చి చంపారు.
కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య
September 21, 2023
0
Tags