ఒడిశాలోని అనుగులు జిల్లాలో గూడ్స్ రైలు ఇంజిన్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రైలు పట్టాలు తప్పింది. రైలుమార్గంలో పడిన బండరాళ్లను రైల్వే సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం తాల్చేర్ నుంచి సంబల్‌పూర్‌కు బొగ్గులోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. ఈ నేపథ్యంలోనే కొండ చరియలు జారి పడినట్లు అధికారులు తెలిపారు. https://t.me/offerbazaramzon
గూడ్స్ ఇంజిన్‌పై విరిగి పడిన కొండచరియలు
August 02, 2023
0
Tags