డబ్బు విషయంలో తండ్రితో గొడవపడి భార్యతో కలిసి ఆత్మహత్య

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని గజ్రౌలా కొత్వాలి ప్రాంతానికి చెందిన సిక్రి ఖాదర్ గ్రామానికి చెందిన  షేన్ ఆలం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడికి ఐదు నెలల క్రితమే నజియాతో వివాహమైంది. నజియా నాలుగు నెలల గర్భిణి. షేన్ ఆలంకు ఆరుగురు తోబుట్టువులు. అతడు అందరికంటే పెద్దవాడు. డబ్బు విషయంలో షేన్‌కి తన తండ్రితో గురువారం గొడవ జరిగినట్లు, దీని తర్వాత షేన్ తన భార్య నజియాను కారు ఎక్కించుకుని ఆత్మహత్యకు పూనుకున్నట్లు తెలుస్తుంది. కారు తీసి మొదట తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లను ఢీ కొట్టాడు. అనంతరం కారును దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గంగానదిలోకి పోనిచ్చాడు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఎస్డీఎం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, పీఏసీ డైవర్లు అన్వేషణ ప్రారంభించారు. చాలా గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, మృతదేహాలను సంఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, కారు గురించి ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ఈ సమయంలో గంగానది ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని చెప్పారు. ప్రమాదంలో షేన్ ఆలం తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)