మీ భూముల్ని లాక్కొని అదానీకి కట్టబెట్టేందుకే !

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ లడాఖ్‌ పర్యటనలో భాగంగా ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ 'మీ భూములను లాక్కొని అదానీ గ్రూప్‌కి అప్పజెప్పేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. మీ భూముల్ని అదానీకి కట్టబెడితే ఆయన ఇక్కడ ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ ప్లాంట్‌ వల్ల వచ్చే లాభాల్ని మీకు పంచరు. మీ భూముల్ని అదానీ గ్రూపుకు ఇవ్వకుండా మీరే అడ్డుకోవాలి' అని రాహుల్‌ లడాఖ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. లడాఖ్‌ వ్యూహాత్మక ప్రదేశం. ఇక్కడున్న భారత భూభాగాన్ని చైనా తీసుకుంది. కానీ ప్రధాని మోడీ మాత్రం చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని చెబుతున్నారు. ప్రధాని చెప్పేవన్నీ అసత్యాలే అని రాహుల్‌ పేర్కొన్నారు. కొద్దినెలల కిందట తాను చేపట్టన భారత్‌ జోడో యాత్రలో భాగంగా లడాఖ్‌లో చేరుకోవాలనుకున్నా.. అప్పుడు హిమపాతం కారణంగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోయినట్లు రాహుల్‌ చెప్పారు. అయితే ఈసారి బైక్‌పై లడఖ్‌కి చేరుకుని యాత్ర కొనసాగించినట్లు రాహుల్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)