మోడీ ప్రభుత్వం తన వాక్చాతుర్యంతో ఎంత కాలాన్ని వృధా చేస్తున్నదని బుధవారం కాంగ్రెస్ ధ్వజమెత్తింది. చైనాతో సరిహద్దు అంశాన్ని పరిష్కరించకుండా, భారతమాతను పరిరక్షిస్తామనే వ్యాఖ్యలతో సమయాన్ని వృధా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. సరిహద్దులో యథాతథ స్థితిని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మోడీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గత మూడేళ్లుగా ప్రతిసారీ చైనాతో చర్చలు విజయవంతం కావడం లేదని, చైనాతో ఇప్పటికి 19 రౌండ్ల చర్చలు జరిపారని మీడియా నివేదికలనుద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. 2020 ఏప్రిల్‌లో సరిహద్దుల్లో ఉన్న యథాతథ స్థితిని గత మూడున్నరేళ్లలో పునరుద్ధరించలేకపోయారని ఎద్దేవా చేశారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని మోడీ గతంలో పేర్కొన్నారని.. ఎవరూ ప్రవేశించకపోతే.. చైనాతో చర్చలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు. అలాగే భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని ఆర్మీ పేర్కొనడం కూడా తప్పేనని అన్నారు.
వాక్చాతుర్యంతో ఎంత సమయాన్ని వృధా చేస్తారు ?
August 16, 2023
0
Tags