గుజరాత్ లోని సూరత్ లో పట్టపగలు ఐదుగురు దొంగలు బ్యాంకును లూటీ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ లోకి చొరబడి రూ. 14 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన దుండగులు బైకులపై హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. అనంతరం ఆయుధాలతో బ్యాంకులోకి చొరబడ్డారు. దొంగలు తమ వద్ద ఉన్న తుపాకులను ఉద్యోగులు, కస్టమర్లకు చూపుతూ వారిని బెదిరించారు. దొంగలు బ్యాంకు కౌంటర్లలోని డబ్బును తమ బ్యాగుల్లో వేయమని సిబ్బందికి సూచించారు. డబ్బును బ్యాగుల్లో వేసిన తర్వాత బ్యాంకు సిబ్బందిని, కస్టమర్లను ఓ గదిలో బంధింసి, అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ తతంగమంతా జరగడంతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు షాక్ కు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి సీసీ టీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. సూరత్ అంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
పట్టపగలు బ్యాంకు లూటీ !
August 12, 2023
0
Tags