దేశం కోసం 10 వేల మంది సైనికులను తీర్చిదిద్దిన సైద్‌పూర్ !

Telugu Lo Computer
0


మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ నుండి విదేశీ విధుల నిర్వహణ కోసం పంపినపుడు ఉత్తర ప్రదేశ్ లోని సైద్‌పూర్ నుండి 155 మంది సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది విదేశాలలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. 66 మంది స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ప్రస్తుత కాలం వరకు 10 వేల మందిని సైనికులుగా తీర్చిదిద్దింది సైద్‌పూర్. సైద్‌పూర్ గ్రామం నడిబొడ్డున దేశం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది గ్రామస్తుల పేర్లతో నిర్మించిన స్మారక చిహ్నం కూడా ఉంది. ప్రస్తుతం సైద్‌పూర్ గ్రామంలో బులంద్ షహర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రామంలో 21,000 మంది జనాభా ఉన్నారు. వీరిలో 2,450 మంది సైనికులుగా విధులు నిర్వహిస్తుండగా, 1,100 మంది ఇప్పుడు సైన్యంలో చేరారు. యూపీ పోలీసు, పారామిలటరీ బలగాలతో సహా 550 మంది ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. 1962 నాటి చైనా-ఇండియా మధ్య, 1965,1971 సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో కూడా ఈ గ్రామం నుండి సైనికులు పాల్గొన్నారు. ఇప్పటికీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించే యువకులు పల్లెల్లో మనకు కనబడతారు. సైద్‌పూర్ గ్రామంలో ఇంటికి ఓ వీర సైనికుడు ఉండడం ఆ గ్రామం ప్రత్యేకత.

Post a Comment

0Comments

Post a Comment (0)