కర్నాటకలోని మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కెమికల్ పరీక్షల్లో తేలింది. జూలై 17,2023న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నంజన్‌గడ్ యూనిట్‌లో తయారు చేయబడిన బీర్లలలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నంజన్‌గడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జూలై 28న ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని కెమికల్ టెస్ట్ కోసం పంపారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్టు వచ్చే వరకు స్టాక్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన రిపోర్టు ఆగస్ట్ 2 న వచ్చింది. ఆ బీర్లలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లు ఉపయోగానికి పనికి రావని, వాటిని తాగితే ప్రమాదమని పరీక్షల్లో తేలింది. దీంతో రసాయన పరీక్ష నివేదికలో విఫలమైన స్టాక్‌ను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. అక్కడ తయారైన రూ.25 కోట్ల విలువైన 78వేల 678 బీరు బాక్సులను సీజ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.
కింగ్ ఫిషర్ ప్రమాదకర రసాయనాలు !
August 17, 2023
0
Tags