ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార !

Telugu Lo Computer
0


యనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో పిల్లలను ఎత్తుకుని మాస్‌ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇన్నాళ్లు తన సినిమా అప్‌డేట్స్‌ను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో పంచుకున్న నయన్.. ఇప్పుడు అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి వచ్చింది. ఇక నయన్‌ ఇన్‌స్టాలో ఐదుగురిని ఫాలో అవుతుంది. అందులో భర్త విఘ్నేష్, షారుఖ్ ఖాన్‌, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్‌ సంస్థ ది రౌడీ పిక్చర్స్‌, ఒబామా భార్య మిషెల్లి ఒబామాను ఫాలో అవుతుంది. దశాబ్ద కాలంగా నయనతార దక్షిణాదిలో అగ్ర కథానాయికగా చెలామణి అవుతుంది. అంతేకాదు దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో అగ్ర స్థానం నయనతారదే. ఇక లేడి ఓరియెంటెడ్‌ సినిమా అంటే దర్శక నిర్మాతలకు ఫస్ట్‌ ఆప్షన్‌ నయన్‌తారనే. అయితే గతకొంత కాలంగా నయన్‌ను బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు వెంబటిస్తున్నాయి. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నయన్‌.. ఈ మధ్య కాస్త డల్‌ అయింది. ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొడున్నాయి. అయితే ఫలితం ఎలా ఉన్నా నయన్‌ మాత్రం గ్యాప్‌ లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నయన్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో వారం రోజుల్లో రిలీజయ్యే జవాన్‌ కూడా ఒకటి.

Post a Comment

0Comments

Post a Comment (0)