కర్ణాటక లోని కలబురిగి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కర్ణాటక రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్, ఐటీ-బీటీ, కలబురిగి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రూ. 5 వేలు జరిమానా విధించడం హాట్ టాపిక్ అయ్యింది. జరిమానా చెల్లించేందుకు మంత్రి ప్రింయాక్ ఖార్గే కూడా అంగీకరించారు. ఈ మేరకు గురువారం మహానగర పాలిక ట్వీట్ చేసింది. గౌరవనీయులైన కలబురిగి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గర్, కలబుర్గి మహానగర కార్పొరేషన్ అనుమతి లేకుండా బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించబడింది, కాబట్టి కార్పొరేషన్ మంత్రి ప్రియాంక్ ఖార్గేకి రూ. 5, 000 జరిమానా విధించారని అధికారులు తెలిపారు. కార్పొరేషన్ అధికారుల చర్యకు మద్దతుగా నిలిచిన మంత్రి ప్రియాంక్ ఖార్గే పెనాల్టీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించారు అని కార్పొరేషన్ ఒక ట్వీట్‌లో తెలిపింది. మహిళలకు రూ. 2 వేలు ఇచ్చే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అలంద రోడ్డులోని కలబురగి తాలూకా భీమల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బంగారు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పాల్గొన్నారు.
మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రూ. 5 వేలు జరిమానా !
August 31, 2023
0
Tags