దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోడీ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌కు ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే బెంగళూరుకు వచ్చి ఇస్రో బృందాన్ని వ్యక్తిగతంగా కలుస్తానని అన్నారు. 'సోమనాథ్ జీ.. మీ పేరు సోమ్‌నాథ్ కూడా చంద్రుడితో ముడిపడి ఉంది. మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. మీకు, మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు' అని ఇస్రో ఛైర్మన్‌తో ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ పర్యటనలో ఉన్న ఆయన.. చంద్రుడిపై ల్యాండర్ దిగిన వెంటనే సోమనాథ్‌కు ఫోన్ చేశారు. ఆ చారిత్రక ఘట్టాన్ని అక్కడి నుంచే వీక్షించిన మోదీ.. విజయవంతంగా దిగిన వెంటనే జాతీయ జెండాను ఊపుతూ విజయోత్సాహాన్ని పంచుకున్నారు.
'సోమనాథ్ జీ.. మీ పేరు చంద్రుడితో ముడిపడి ఉంది'
August 23, 2023
0
Tags