తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారాయన. ఆదిత్య ఎల్1 ప్రయోగంలో కరోనాగ్రాఫీ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమికి సూర్యుడికి మధ్య ఎల్1 పాయింట్ చుట్టూ ఒక హాలో ఆర్బిట్‌లో చొప్పిస్తారు. సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు, భూమి చుట్టూ ఉన్న పర్యావరణంపై దాని ప్రభావం తదితర అంశాలపై ఇది అధ్యయనం చేస్తుంది. ఇస్రో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను దేశంలోని వివిధ పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. పీఎస్‌ఎల్వీ-ఎక్సెల్(సీ 57) ద్వారా షార్ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం చేపట్టనుంది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్1 సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది.
సెప్టెంబర్ లో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడతాం !
August 23, 2023
0
Tags