బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్‌లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్‌పూర్‌లోని కోర్టు హాల్‌లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్‌లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. 'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు.
ఆత్మ గౌరవంతో రాజీ పడలేను !
August 04, 2023
0
Tags