విద్యుద్ఘాతానికి మూడు అడవి ఏనుగులు బలి

Telugu Lo Computer
0


స్సాంలోని కమ్రూప్ జిల్లాలో తమలపాకు తోటలో ఆహారం కోసం వెళ్లిన మూడు అడవి ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మరణించాయి. రాణి అటవీ రేంజ్ పరిధిలోని పనిచంద ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవి ఏనుగుల గుంపు ఆహారం కోసం సమీపంలోని అడవి నుండి ఆ ప్రాంతానికి వచ్చాయని, మూడు ఏనుగులు విద్యుత్ తీగలు తగిలి మరణించినట్లు కమ్రూప్ ఈస్ట్ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి సైకియా తెలిపారు. ఆడ ఏనుగుతో పాటు రెండు ఏనుగు పిల్లలు కూడా తోటలోకి వచ్చి చెట్టును లాగడానికి ప్రయత్నించాయని.. ఆ సమయంలో ఆ చెట్టుకు కరెంట్ వైర్లు ఉండటంతో విద్యుదాఘాతానికి గురైయ్యాయని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి విద్యుదాఘాత ఘటనలు చోటుచేసుకున్నాయని విచారం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)